e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News Ganesh: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్‌

Ganesh: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్‌

నల్లగొండ: గణేశ్‌ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, డీఐజీ రంగనాథ్‌ తెలిపారు. ఆదివారం నిమజ్జనం జరిగే నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, 14వ మైలురాయి వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

పటిష్ట బందోబస్తుతో పాటు సమయాన్నిపాటిస్తూ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌, పోలీసులతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement