హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తమ విచారణకు హాజరైన అధికారులతో.. వారిచ్చే సమాధానాలను, వారికి తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని కాశేశ్వరంపై ఏర్పాటుచేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్‌ల నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజినీర్ల విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. మంగళవారం 20 మందితో స మావేశం అయినట్టు తెలిపారు. వారి నుంచి మూడు బరాజ్‌లకు సంబంధించిన సమాచారం తీసుకున్నామని వెల్లడించారు. విచారణకు హాజరయ్యేవారంతా ఈ నెల 25వ తేదీలోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటివరకు ఇంజినీర్లతో సమావేశం అయ్యామని, తదుపరి ఏం చేయాలో జాబితా సిద్ధం చేస్తామని తెలిపా రు. త్వరలో నిర్మాణ సంస్థలను పిలిచి విచారిస్తామని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇతరుల వద్ద ఏదై నా సమాచారం ఉంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని అన్నారు. బరాజ్‌లు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమేనని జస్టిస్ ఘోష్ అభిప్రాయపడ్డారు.