హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) ఇం దుకు ఆమో దం తెలిపింది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ.28,602 కోట్ల తో దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో జహీరాబాద్లో పారి శ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. . రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది.
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు