హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశ సరిహద్దుల్లో డ్రోన్ దాడులను సమర్థవంతంగా నిలువరిస్తూ గస్తీ కాసేందుకు ఉపయోగపడేలా యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ‘ఇంద్రజాల్’ను హైదరాబాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్‌రాజు రూపొందించారు. డ్రోన్ దాడుల నుంచి ప్రజలను కాపాడుతూ, శత్రుడ్రోన్లను పేల్చే పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని తయారు చేశారు. బుధవారం హైదరాబాద్ టీహబ్‌లో ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్పాండే చేతుల మీదుగా ‘ఇంద్రజాల్’ను ఆవిష్కరించారు. ఈ వాహనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుందని రూపకర్తలు తెలిపారు.
‘ఇంద్రజాల్’తో ప్రయోజనాలు
దేశ అంతర్గత భద్రతలో కీలకం
ఈ వాహనం భారతదేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది. అక్రమ రవాణా(స్మగ్లింగ్)తోపాటు, డ్రోన్ల చొరబాటును నిలువరించగలదు. భారతీయుల స్వేచ్ఛను రక్షించడమే ‘ఇంద్రజాల్’ ప్రాథమిక లక్ష్యం.
-కిరణ్‌రాజు, ఇంద్రజాల్ సంస్థ ఫౌండర్
భవిష్యత్తుకు రక్షణ కవచం
దేశ యువతను అంతర్జాతీయ నేర ముఠాల నుంచి రక్షించేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. యాంటీ డ్రోన్ పెట్రోల్ వాహనం వంటి సాంకేతిక పరికరాలు కేవలం యంత్రాలు మాత్రమే కావు. అవి మన పిల్లలు, రైతులు, భవిష్యత్తును కాపాడే రక్షణ కవచాలు. -దేవేంద్ర ప్రతాప్పాండే, లెఫ్టినెంట్ జనరల్