Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కొడుకుకు బెయిల్ ఇస్తే తన భర్తకు చైర్మన్ పదవి ఇస్తారని తప్పుడు ప్రచారం చేశాడు.
అసత్య ఆరోపణలు చేసిన వారిపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దామెదర్ను అరెస్ట్ చేశారు. ఈ దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.