హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఈ మేరకు బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రెవెన్యూ, గృహనిర్మాణశాఖలపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిషరించాలని సీఎం ఆదేశించారు. అనంతరం కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.