బయ్యారం, ఫిబ్రవరి 7: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు మళ్లీ మంజూరు పత్రాలు అందజేశారు. ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల ఆవేదనపై నమస్తే తెలంగాణలో ‘ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు వెనక్కి’ అనే శీర్షికతో కథనం ఈ నెల 5న ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు తీసుకున్న పత్రాలను ఇంటింటికీ తిరిగి రిజిస్టర్లో సంతకాలు చేయించుకొని మళ్లీ లబ్ధిదారులకు అందజేశారు.