బోయినపల్లి, జూలై 18 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ప్రజాపాలన పైలట్ గ్రామం అనంతపల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో వసూళ్ల పర్వం బహిర్గతమైంది. శనివారం గ్రామంలో మహిళా వీవో భవన నిర్మా ణ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఓ బాధితుడు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసినట్టు అధికార పార్టీ, గ్రామానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారా? అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలతో ఇందిరమ్మ కమిటీ మెంబర్ సోదరుడు వాగ్వాదానికి దిగా డు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకోసం తన దగ్గరకూడా డబ్బులు తీసుకున్నారంటూ అరోపణలు చేయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.