Indiramma Illu | అశ్వారావుపేట, మే 12 : ‘మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? మాకు ఎందుకు మంజూరు చేయలేదు? కాంగ్రెస్ సానుభూతిపరులు, అనుచరులకే ఇందిరమ్మ కమిటీలు ఇండ్లు మంజూరు చేస్తున్నాయి, వెంటనే కమిటీలను మార్చాలి’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్లలో గిరిజన మహిళలు ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణను నిలదీశారు.
సోమవారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానికంగా సీసీ రోడ్లను ప్రారంభించారు. కావడిగుండ్లలో మహిళలలతో వారు మాట్లాడగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై నిలదీశారు. స్పందించిన ఎమ్మెల్యే పది రోజుల్లో ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఇండ్లు మంజూరు చేస్తానని, దశలవారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.