ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరీ ముగ్గుపోశారు.
బంగారం కుదువబెట్టి, అప్పులు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తిచేసింది. మూడు దశల్లో రావాల్సిన బిల్లుల్లో ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు. దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటికి ఇలా ఫ్లెక్సీ కట్టింది.