విద్యానగర్, జూన్ 7: కరీంనగర్‌కు చెందిన మహిళకు అరుదైన ఘనత సాధించింది. ఆసియా ఖండంలోనే ఏకైక అగ్నిపర్వతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్‌లో గల అగ్ని పర్వతంపైకి మొదటిసారిగా అడుగు పెట్టింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, డెహ్రాడూన్, ఇస్రో వారి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమతాహాన్ సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరైన కరీంనగర్ వాసి మహమ్మద్ పర్వీన్ సుల్తానా గత నెల 29న బెరన్ ఐలాండ్‌లోని అగ్ని పర్వతంపై మొదటిసారిగా అడుగిడింది.
అగ్ని పర్వత భౌగోళిక పరిణామాలు, శాస్త్రీయ విశ్లేషణ, పనితీరు, ప్రకృతి విపతర పరిస్థితుల అంచనా కోసం అకడ లభించిన వివిధ రకాల నమూనాలను సేకరించారు. అండమాన్ ఐలాండ్‌లోని డిగ్లీపూర్ నుంచి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకుపైగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ముడ్ వల్కనోను పరిశీలించారు. ఈ సాహసోపేతమైన పరిశోధన పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, డెహ్రాడూన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఇండియన్ కోస్ట్ గార్డ్ (రాజ్‌కమల్) నౌక అండమాన్ నికోబార్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల వారు సహకరించారు.