హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : టికెట్ బుకింగ్, డిజిటల్ టికెట్ల విషయంలో ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకనుంచి టికెట్లు వాట్సాప్, స్క్రీన్షాట్లు, ఫొటోలు, పీడీఎఫ్ కాపీలతో ప్రయాణించడం చెల్లదు. టీటీఈ తనిఖీ సమయంలో వీటిని చూపిస్తే టికెట్ లేని ప్రయాణంగా చూసి.. ఫైన్ వేసే ప్రమాదం ఉన్నది. ఇకపై అన్ని టికెట్ల బుకింగ్ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 60 రోజులకు తగ్గించారు.
ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని భారతీయ రైల్వే వెల్లడించింది. రిజర్వేషన్ లేని టికెట్లను రైల్వే వన్ యాప్ లేదా యూటీఎస్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే, ప్రయాణ సమయంలో టికెట్ ఆ యాప్‌లోనే ఉండాలి. ఏ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ డివైజ్ ద్వారా టికెట్ బుక్ చేశారో ప్రయాణంలో అదే ఫోన్ చూపించాలని అధికారులు పేర్కొన్నారు.