హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భారత క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నారు. హైదరాబాద్ బొల్లారంలోని తన నివాసమైన సురభి ఎన్‌క్లేవ్‌లో హనుమ విహారి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హనుమ విహారి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్, రాహుల్ ద్రవిడ్, కృష్ణ ప్రియకు మొక్కలు నాటాలని హనుమ విహారి చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం హనుమ విహారికి వృక్షవేదం పుస్తకాన్ని రాఘవ బహుకరించారు.