హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన యువతీ, యువకులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది.
26 డిసెంబర్ 2002 నుంచి 26 జూన్ 2006 మధ్య జన్మించి, ఇంటర్మీడియట్, తత్సమానం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు https://agnipathvayu.cdac.in లేదా తమ జిల్లాలోని ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నది.