హైదరాబాద్: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నాయకులు, జాతి నిర్మాతలు యువతే అన్నారు. దేశానికి అత్యంత బలమైన శక్తి యువత అని తెలిపారు. యువత వివేకంతో కలలు కనాలని, మనస్ఫూర్తిగా వాటిని నమ్మాలని, శక్తిసామర్థ్యాలతో ఆ కలలను సాకారం చేసుకోవాలని ట్వీట్ చేశారు.
‘దేశానికి అత్యంత బలమైన శక్తి యువత. దేశంలో 50 శాతానికిపైగా 25 ఏండ్లలోపువారే ఉన్నారు. రేపటి హీరోలు, దేశ నిర్మాతలకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. వివేకంతో కలలు కనండి.. మనస్ఫూర్తిగా నమ్మండి.. శక్తిసామర్థ్యాలతో సాకారం చేసుకోండి’ అని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
The most potent force in the armoury of India 🇮🇳 is the force of youth
— KTR (@KTRTRS) August 12, 2021
More than 50% of our nation is below the age of 25. My best wishes to the heroes & nation builder of tomorrow on #InternationalYouthDay pic.twitter.com/dahVkVzOhU