Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలు జరిగే గోల్కొండ కోట వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ సైతం నిర్వహించారు. కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్బీ, సీఏఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఆర్పీఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటీ సెక్యూరిటీ వింగ్ బృందాలు రెండు వారాలుగా భద్రతపై కసరత్తు చేస్తున్నాయి.