హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో రికార్డుస్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత 5.2డిగ్రీలుగా నమోదైంది.
వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. గురువారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు, మిగితా జిల్లాల్లో 14 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాతావరణ శాఖ ఆరెంజ్,ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 5.9, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.