ఖైరతాబాద్, జూన్ 7 : కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్, అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంటా నాగయ్య, గీత మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, కేజీబీవీ, యూఆర్ఎస్ నాన్‌టీచింగ్ వర్కర్స్కు నెలకు రూ.27వేల వేతనాలు ఇచ్చి పర్మినెంట్ చేయాలని కోరారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.