హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి సహా కోలిండియా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ను తక్షణమే పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బుధవారం కోలిండియా చైర్మన్కు ఆ సంఘం అధ్యక్షుడు రామచందర్రావు, ప్రధాన కార్యదర్శి బానయ్య ఈ-మెయిల్ చేశారు. 1998 నుంచి పెన్షన్ను పెంచకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులకు పెన్షన్ సరిపోవడం లేదని, పెన్షన్ను పెంచాలని విజ్ఞప్తి చేశారు.