హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షాకేంద్రాలు ఈ ఏడాది పెరగనున్నాయి. అదనంగా 32 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పరీక్షాకేంద్రాలను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. నిరుడు ఇంటర్ పరీక్షలకు 1,480 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 1,512 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. నిరుడుతో పోల్చితే ఈసారి 30 వేల మంది విద్యార్థులు అదనంగా పెరిగారు. ఈ ఏడాది ఇంటర్లో మొత్తం 10,59,233 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఇప్పటివరకు 9,77,040 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అయితే, ఈ నెల 3 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉన్నది.