Telangana | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. కలెక్టర్లు పట్టించుకోకపోవడం, పారిశుధ్య నిధులను మం జూరు చేయకపోవడమే ఇందుకు కార ణం. రాష్ట్రంలోని 26వేల పైచిలుకు పాఠశాలల పారిశుధ్య నిర్వహణ బా ధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లా మినరల్ ట్రస్ట్ ఫండ్ (డీఎంఎఫ్టీ) నిధులను వినియోగించాలని ఆదేశాలిచ్చింది. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలకు రూ.మూడువేలు, గరిష్ఠంగా రూ.6వేల వరకు ఇవ్వాల్సి ఉంది. 8 నెలల తర్వాత కూడా చాలా జిల్లాల్లో మూడు నెలల నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించినవే విడుదల చేశా రు. ఆర్థిక సంవత్సరం మారో మూడు వారాల్లో ముగియనున్నది. దీంతో నిధులు ఇవ్వడం సాధ్యమేనా..? అన్న పరిస్థితులున్నాయి. హెచ్ఎంలు, టీచర్లల్లో ఆందోళన నెలకొన్నది.
వాస్తవ పరిస్థితులిలా..