కవాడిగూడ, ఏప్రిల్ 5: కవాడిగూడలోని సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదాయపు పన్నుశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న విజయలక్ష్మి (52) కవాడిగూడలోని సీజీవో టవర్స్‌పై నుంచి దూకింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది.
సీజీవో టవర్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీంతో కలిసి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించి.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.