ఘట్కేసర్,సెప్టెంబర్21 : సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యేవివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 2వార్డులోని వివిధ పార్టీలకు చెందిన 60 మంది యువకులు బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
అనంతరం ఆయన మట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని అభివృద్ది తెలంగాణలో జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందని మంత్రి వివరించారు. . 2వార్డులోని సాయిగౌడ్, సుధీర్‌రెడ్డి,అరవింద్ క్రాంతి,సాయి, భరత్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు పార్టీలో చేరారు.
కార్యక్రమంలో పోచారంటీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, కొండల్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్,టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, ఎన్.కాశయ్య జి.శేఖర్,శశిధర్ రెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.