వరంగల్ : బీఆర్ఎస్లోలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పలువురు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంద రమేష్, ఉపాధ్యక్షుడు బొమ్మిదేవి నరేష్, కార్యదర్శి మంద రాజు, మంద నరేష్, మంద రవి, మంద రామకృష్ణ, మంద శ్రీనివాస్, తాటికాయల బాబు, కందికట్ల లైలా, గుడ్ల రవి, ఎలికట్టే భాస్కర్ తదితరులు ఉన్నారు.
అలాగే రాయపర్తి మండలం గ్రామం కాట్రపల్లి ఉపసర్పంచ్ కందుకూరి- రేణుక యకయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తా, పాత అనే తేడాలేకుండా అందరూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయానలి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.