హనుమకొండ చౌరస్తా, మే 31: కాకతీయ యూనివర్సిటీలో పైసలకు అలవాటుపడిన ముగ్గు రు దినసరి వేతన కూలీలు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి జవాబుపత్రాలు బయటకు పంపిన ఘటన కేయూలో దుమారం రేపుతున్నది. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ న ర్సింహాచారి, కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అస లు విషయం బయటకు వచ్చింది. జవాబు పత్రాలను బ్రాంచ్‌లో ప ని చేస్తున్న దినసరికూలీలు సునీ ల్, రాణాప్రతాప్, శ్రీధర్ తిరిగి వారికి చేరవేసి మళ్లీ రాయించి ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వాటిని బ్రాంచ్‌కు చేర్చినట్టు తెలుస్తున్నది. ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసి విచారిస్తున్నారు.