శంకరపట్నం, ఏప్రిల్ 21: పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది. బాధిత రైతు కాసు మచ్చయ్య కథనం ప్రకారం.. మచ్చయ్యకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 17లో వ్యవసాయ బావి ఉంది. ఎన్హెచ్ఏఐ-563 రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్నాడు. డీబీఎల్ సంస్థ విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం మచ్చయ్య బావిని పూడ్చివేస్తుండగా పరిహారం చెల్లించకుండా పూడ్చ వద్దని రైతు అడ్డుకున్నాడు. సైట్ ఇంజినీర్ నిరంజన్ మచ్చయ్యను బూతులు తిడుతూ, పక్కనే ఉన్న బావిలోకి తోశాడు. మచ్చయ్య కొడుకు వెంటనే తండ్రిని తాడు సహాయంతో బయటకు లాగి, హుజూరాబాద్ దవాఖానకు తరలించారు.