హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లో మరో 5 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గడిచిన 24గంటల్లో వనపర్తి జిల్లా రేవెల్లిలో అత్యధికంగా 9.65సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.