ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 24: నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగ జేఏ సీ చైర్మన్, ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్నాయక్ దీక్షకు దిగారు. ముందుగా ని రుద్యోగులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ని రాహార దీక్షకు కూర్చునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మోతీలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పా ర్టీ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. మో తీలాల్నాయక్కు బక్క జడ్సన్, విద్యార్థి సం ఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.