Congress | పరకాల, అక్టోబర్ 28: పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని సీనియర్ నేత, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న తనకు కాకుండా వారం క్రితం పార్టీలో చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
శనివారం హనుమకొండలోని తన నివాసంలో అనుచరులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కొంతమంది అధిష్ఠానం పెద్దల సూచనతో పరకాల టికెట్ తనకే వస్తుందని శుక్రవారం వరకు ఆశపడ్డానని, కానీ తనకు మొండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టంచేశారు. 24 గంటల్లో తనకు టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో తనదారి తాను చూసుకుంటానని హెచ్చరించారు.