ఎల్లారెడ్డిపేట : సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) పాలనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రేవంత్ రెడ్డి అనాలోచిత, సంకుచిత నిర్ణయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై రాజకీయ వేధింపులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో ఆ పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య కూడలిలో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ప్రభుత్వానికి, రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణకు ఇచ్చినట్టే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తెలివిని గొర్రె తెలివిగా అభివర్ణించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు వంగ శివరాంరెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, దేవ రెడ్డి, సత్యంరెడ్డి, సత్యం, ఇర్ఫాన్ , అశ్వక్ ,నాగరాజు, ప్రసాద్, శ్రీధర్ , నిరటి రాజు, చంద్ర రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.