మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్పుగొండ ముత్తయ్య, వెంకట నర్సు, తండా యాకయ్య తదితరులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.