హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు చుక్కలు చూపిస్తున్నారు. వారి పోకడలు నచ్చక టీఆర్ఎస్లో భారీ సంఖ్యలో చేరుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు హైదరాబాద్ లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కస్తాల సర్పంచ్ ద్రౌపధమ్మా వెంకట్ రెడ్డి, నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి , గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాశ్, దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మలపల్లి సర్పంచ్ కూరపాటి రాములమ్మ సైదులు చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వారికి గులాబి కండువా కప్పి స్వాగతం పలికారు.
అదేవిధంగా మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత , సత్యనారాయణ గౌడ్ దంపతులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మండలం కిష్టాపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం తదితరులు చండూరు మార్కెట్ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ ‘జన బంధువు’ సీఎం కేసీఆర్ వెంటే తాము ఉంటామని టీఆర్ఎస్ లో చేరిన ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.