హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల భర్తీలో డౌన్మెరిట్ను అమలు చేయాలని కోరుతూ 1:2 అభ్యర్థులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. “సీఎం రేవంతన్నకు 1:2 ఆడపడచుల రాఖీ పండుగ శుభాకాంక్షలని తెలుపుతూనే, మరోవైపు గురుకుల పోస్టుల భర్తీలో డౌన్మెరిట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ట్రిబ్ డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకపోవడం, ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపట్టడంతోనే గురుకుల పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ మెరిట్‌ను అమలు చేసి బ్యాక్‌లాగ్‌లు లేకుండా చూడాలని 6నెలలుగా పోరాడుతున్నారు. ప్రజాప్రతినిధుల ఇండ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుటనే నిరసనకు దిగారు. ఆదివారం సైతం మరోసారి అభ్యర్థులు రేవంత్‌రెడ్డి ఇంటికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ డౌన్మెరిట్కు అనుకూలంగానే కోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిందని, అయినా ట్రిబ్ అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్మెరిట్ అమలుకు జీవో 81 అడ్డంకి కాబోదని అభ్యర్థులు వెల్లడించారు. నరేందర్, శ్రీనివాస్, సునీత, మహేశ్, రేణుక, సాయికుమార్, నాగలక్ష్మి, లలిత, పరమేశ్వరి, శైలజ, సంపత్, రమణి తదితరులు నిరసన వ్యక్తంచేశారు.