హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. 17,200 మంది రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్లతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.