హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
యాసంగి సీజన్లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 141 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేశామని చెప్పారు. 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైందని, ఇప్పటివరకు 17.28 లక్షల టన్నులను కొనుగోలు చేసిందని, రైతులకు రూ. 2,310 కోట్లను చెల్లించిందని వివరించారు.