హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Rain Alert). శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ మేరకు రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీచేసింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్సాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్‌లో వర్షం జోరుగా కురుస్తున్నది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నది. శనివారం ఉదయం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్‌పేట, మాదాపూర్, ఫిల్మ్‌నగర్, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, మెహిదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Today’s FORECAST ⚠️🌧️
GUSTY WINDS UPTO 40-45Kmph are expected in entire Telangana
MODERATE RAINS ahead in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Kamareddy, Sircilla, Jagitial, Mancherial, Peddapalli, Vikarabad, Sangareddy, Rangareddy
LIGHT RAINS/PASSING SHORT RAINS in rest…
— Telangana Weatherman (@balaji25_t) July 26, 2025
MODERATE RAINS from Kamareddy, Medak to cover Sircilla, Karimnagar, Siddipet, Hanmakonda, Warangal, Bhupalapally, Nizamabad, Jagitial, Peddapalli, Jangaon next 2hrs ⚠️🌧️
Drizzles to continue in Hyderabad and also Rangareddy, Sangareddy, Vikarabad, Yadadri, Nalgonda for next…
— Telangana Weatherman (@balaji25_t) July 26, 2025