హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్‌లోని మక్కా మసీదు ఇమామ్ హఫీజ్ మౌలానా మహమ్మద్ ఉస్మాన్ నక్ష్బందీ (70) శనివారం ఉదయం టోలిచౌకిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. సాయం త్రం మక్కా మసీదులో ఆయన పార్థివదేహాన్ని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అం త్యక్రియల్లో ఆయన అభిమానులు, కుటుంబీకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ఇమామ్ హఫీజ్ మౌలానా మహమ్మద్ ఉస్మాన్ నక్ష్బందీ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఇమామ్‌గా సుమారు 50 సంవత్సరాలు పనిచేసిన వారి సేవలు గొప్పవని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి మౌలానా కృషి, వారితో తనకున్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన మృతి ముస్లిం సమాజానికి తీరనిలోటని చార్మినార్ ఎమ్మెల్యేముంతాజ్ అహ్మద్‌ఖాన్ తెలిపారు.