రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వైద్య వృత్తిలో అత్యున్నత సేవలందిస్తున్న డాక్టర్ శోభారాణికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆమె స్థానిక సిరి దవాఖానలో వైద్యురాలిగా పనిచేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు వైద్య సేవలతోపాటు సర్కారు బడి విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు.
ఆమె సేవలను గుర్తించిన తెలంగాణ ఐఎంఏ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసి, గురువారం హైదరాబాద్లో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుషాలీ, భారత అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షుడు కత్తుల సతీశ్, రాష్ట్ర అధ్యక్షుడు కాళీప్రసాద్, ద్వారక ప్రసాద్ తదితరులు శోభారాణికి అవార్డు ప్రదానం చేశారు.