హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను తొలంగించాల్సిందేనని, అయితే ముందుగా పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని అకడి నుంచి ఖాళీ చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన విల్లాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని నిర్మాణాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మఖ్దూంభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా బడాబాబుల జోలికి వెళ్లకుండా పేదల ఇండ్లను తొలగిస్తూ భయాభ్రంతులకు గురిచేయడం తగదని పేర్కొన్నారు.