గజ్వేల్/మర్కూక్, నవంబర్ 27 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జోడాస్ ఎక్స్పోయిమ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో అనుమతి లేకుండా తయారు చేసిన యాంటీబయాటిక్స్ మందులను బుధవారం డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులను రష్యాకు ఎగుమతి చేస్తున్నారనే సమాచారంతో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్సుష్మ, అధికారులు కార్తీక్ శివ చైతన్య, శివతేజ, చంద్రకళ బుధవారం జోడాస్ కంపెనీలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1.33 కోట్ల విలువైన యాంటీబయాటిక్స్ మందులను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కేసులో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు బుధవారం కోర్టుకు గైర్హాజరు కాగా, ఆయన తరఫున న్యాయవాది గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.