గట్టు, అక్టోబర్ 28: తన పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జోగుళాంబ గద్వాల జిల్లా పెంచికలపాడుకు చెందిన వృద్ధురాలు మాల తిమ్మక్క ఆవేదన వ్యక్తంచేసింది. సోమవారం గట్టు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. 283/1, 282/1ఏ తదితర సర్వే నెంబర్లలో ఉన్న తన మూడెకరాల పొలాన్ని తనకు సంబంధం లేని వ్యక్తికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆమె ఆరోపించించి. అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ ఎదుట వాపోయింది. వృద్ధురాలి నుంచి పూర్తి వివరాలు తెలుసుకొన్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేశామని, ఇందులో తమ తప్పు ఏమీ లేదని తహసీల్దార్ సరితారాణి స్పష్టంచేశారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి సమీక్షాసమావేశం నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య లైజన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణిభవన్లో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ పదోన్నతులు, రక్షణ కమిటీల్లో కనీసం ఇద్దరు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సభ్యులను నియమించాలని సూచించారు. సింగరే ణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.