యాదగిరిగుట్ట, జూన్ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. పోలీసులు, విలేకరుల కు డబ్బులు ముట్టజెప్పిన అంశంతోపాటు ఎమ్మెల్యే, సోదరుడి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
వివరాలు ఇలా.. ‘రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం పోలీస్స్టేషన్లలోని పోలీసులు, 16 మంది విలేకరులకు డబ్బులు ముట్టాయి. ప్రభుత్వ భూములు కావు.. ఎస్సీల భూములని అధికారులు, పోలీసులను మేనేజ్ చేసుకుని తవ్వకాలు చేసుకోవచ్చని మైనింగ్ అధికారులే చెప్పారు. ఎమ్మార్వోకు, విలేకరులకు డబ్బులు ఇచ్చాం.
పెద్దగా ఇబ్బందులు ఏమీలేవు. రెండు, మూడు రోజు ల్లో మట్టి తవ్వకాలు పూర్తవుతాయి’ అని రాజాపేట మండల కాంగ్రెస్ నాయకుడు అర్కాల గాల్‌రెడ్డి, సుధాకర్‌తో ఫోన్లో మా ట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టించింది. ‘ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేసి మట్టి తవ్వకాలపై అడిగారు. ప్రభు త్వ భూమి కాదు. పట్టాభూమి కావడంతో అనుమతులు అవసరం లేదు. ఎమ్మెల్యే త మ్ముడు శంకర్, నేను ఎమ్మెల్యేను కలిసి విష యం వివరించాను’ అని గాల్‌రెడ్డి మాట్లాడిన మాటలతో మట్టి అక్రమ తవ్వకాల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రమేయం ఉందన్న నిజం తేటతెల్లమైంది.