పాల్వంచ/ ఇల్లెందు, సెప్టెంబర్ 14: టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామన్, లైవ్ టెక్నీషియన్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నల్లబ్జాడ్యీలు ధరించి ఇల్లెందులోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తంచేశారు. టీన్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై కొణిజర్ల పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుర్రం రాజేశ్ మండిపడ్డారు. కేసులను నిరసిస్తూ సోమవారం నిర్వహించనున్న భద్రాద్రి కలెక్టరేట్ ముట్టడిని జర్నలిస్టులు జయప్రదం చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జాతీయ కౌన్సిల్ సభ్యుడు చంద్ర నరసింహారావు పిలుపునిచ్చారు.