అమ్రాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు చెంచు నాయకులు మాట్లాడుతూ.. చెంచుల కోసం తెచ్చిన పథకాలలో భాగంగా పోడు భూములు కలిగిన కొంతమంది రైతులకు ఈ పథకాన్ని పరిచయం చేస్తున్నారన్నారు.
అదేవిధంగా చెంచుల అభివృద్ధి కోసం మన్ననూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడున్న నైటీరియా కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారని, దానిని తిరిగి మన్ననూర్కు తీసుకురావాలన్నారు. చెంచుల కోసం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి సమావేశానికి చెంచు నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలుచేస్తామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి గిరిజనులను అరెస్టు చేయడం ఏంటన్నారు. అరెస్టయిన వారిలో చర్లపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయకులు మల్లికార్జున్, గురువయ్య ఉన్నారు.