హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుపై ఐకేపీ వీవోఏలు జంగ్ సైరన్ మోగించారు. ప్రభు త్వం ఇచ్చే గౌరవ వేతనం రూ.5వేల ఏ మూలకూ సరిపోవడం లేదని, రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీవోఏ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సెర్ప్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చా రు. రాష్ట్ర నలుమూలల నుంచి 3వేల మందికి పైగా వీవోఏలు ఉదయం ఏడు గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న సెర్ప్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు మహిళలని కూడా చూడకుండా పోలీస్ వాహనాల్లో వివిధ స్టేషన్లకు తరలించారు. అలాగే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకుంటు న్న వీవోఏలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు.
బేగంపేట, ముషీరాబాద్, అంబర్‌పేట, ఫలక్‌నుమా, బోయినపల్లి, బోరబండ, మల్కాజిగిరి తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. పలుచోట్ల వీఎల్వోలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కూర్చొని నినాదాలు ఇస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళా సంఘాల సభ్యులకు చేరవేస్తూ క్షేత్రస్థాయిలో మహిళలను చైతన్య పరుస్తున్నామ ని చెప్పారు.
ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనం రూ.5వేలు ఎటూ సరిపోవడం లే దని, కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చి న హామీ మేరకు రూ.20వేలకు పెంచాలని డిమాండ్‌చేశారు. జీవో 58ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సెర్స్ సీఈవో దివ్యాదేవరాజన్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐకేపీ వీవో ఏ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కేతావత్ శరత్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫా పవన్, కోశాధికారి గజెల్లి భీమేశ్ పాల్గొన్నారు.