హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ నెల 26న విడుదలకానున్నది. రెండు పేపర్లకు ప్రాథమిక ‘కీ’ని ఐఐటీ కాన్పూర్ సోమవారం విడుదల చేయనున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 18న నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారి రెస్పాన్స్షీట్లను గురువారం విడుదల చేశారు.
విద్యార్థులు లాగిన్ అయ్యి రెస్పాన్స్షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక ‘కీ’ని సోమవారం విడుదల చేయనుండగా, 27 సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. జూన్ 2న ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. అదే రోజు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు కూడా విడుదలవుతాయి.