ముంబై, జూన్ 20: రామాయణ ఇతిహాసాన్ని కించపరిచేలా నాటకాన్ని ప్రదర్శించిన 8 మంది ఐఐటీ బాంబే విద్యార్థులు ఒక్కొక్కరికీ గరిష్ఠంగా 1.2 లక్షల జరిమానా విధించారు. విద్యా సంస్థలో జరిగిన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ‘రాహోవన్’ పేరుతో రామాయణాన్ని ఎగతాళి చేసేలా మార్చి 1న కొందరు విద్యార్థులు ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ప్రధాన పాత్రధారి రాముడిని అవమానపరిచే దృశ్యాలు, డైలాగులు ఉండటమే కాక, మొత్తం రామాయణాన్నే కించపరిచేలా నాటకం ఉందంటూ కొందరు విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి అది వాస్తవమేని నిర్ధారణ కావడంతో ఒక్కో విద్యార్థికి 40 వేల నుంచి 1.20 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు. జూలై 30లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.