హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బోళ్ల తెలిపారు. 2026 విద్యాసంవత్సరంలో జనవరి సెషన్ అడ్మిషన్ల గడువును పొడిగించామన్నారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే వారు 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం https://ignouad mission.samarth.edu.in వెబ్సైట్, 94924 51812, 040 -23117550 నంబర్లను సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మాడల్ టీచర్లకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్‌ను మంజూరుచేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) కోరింది. ఈ మేరకు బుధవారం సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.