‘నాపల్లె అందాలు చూసితె కనువిందురో’ అని కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాడినట్టు.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి ఎగువన ఉన్న.. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) జలాలు.. దిగువన పారుతున్న ఏఎమ్మార్పీ కాల్వలు.. దాని అంచున పచ్చగా పరుచుకున్న పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.
నిత్యం నీటితో నిండుగా కనిపిస్తూ.. నల్లగొండ జిల్లాకు తాగునీరు ఇవ్వడంతోపాటు రెండు లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించే ఏకేబీఆర్.. ఆ ఊరి అందాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నది. చుట్టూ ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తున్నది. కంటి చూపును కట్టిపడేసే అక్కంపల్లి ప్రకృతి రమణీయతను డ్రోన్ కెమెరాలో బంధించారు.
-పెద్దఅడిశర్లపల్లి