Revanth Reddy | హైడ్రా పేరుతో బెదిరిస్తే చర్యలు తప్పవు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Revanth Reddy | హైదరాబాద్ : హైదరాబాద్లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | నిండు కుండలా నాగార్జున సాగర్.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల
KTR | ఆ ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూత.. రూ. 5 లక్షల సాయం అందజేత
KCR | కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన తండ్రి కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

